హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
ఇంట్లోనే గంజాయి దందా.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్.
70 మంది వినియోగదారుల గుర్తింపు.. 66 మందికి టీజీహెచ్సీ పాజిటివ్
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ఫతేనగర్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో ఓ నివాస గృహాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న గంజాయి దందాను పోలీసులు బట్టబయలు చేశారు. ఇంట్లోనే గంజాయిని నిల్వ ఉంచి చిన్నచిన్న పొట్లాలుగా విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జథేన్ బీని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు సహా సుమారు 70 మంది వినియోగదారులను గుర్తించడం కలకలం రేపింది.విశ్వసనీయ సమాచారం మేరకు ఈగిల్ ఫోర్స్‌కు చెందిన హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ బృందం రాత్రి వేళ ఆకస్మికంగా సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 179.1 గ్రాముల బరువున్న 41 గంజాయి ప్యాకెట్లు, రూ.43,340 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితురాలు వినియోగదారులకు చిన్నచిన్న పొట్లాల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ నివాసంతో సంబంధం ఉన్న 70 మంది గంజాయి వినియోగదారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, 66 మందికి గంజాయిలోని మత్తు పదార్థమైన టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుర్తించిన వారిలో 65 మందిని డీ-అడిక్షన్, పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మైనర్లను చట్టపరమైన నిబంధనల ప్రకారం పునరావాసానికి పంపించారు.ఈ గంజాయి దందాలో అరెస్టయిన వృద్ధురాలితో పాటు మరో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మున్నీ బేగం, ఇమ్రాన్, హనీఫా బీ, ఖాజా బీ అలియాస్ గిడ్డి, షేక్ ఖాజా పాషా పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ అక్రమ వ్యాపారం వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.అరెస్టయిన షేక్ జథేన్ బీపై గతంలో బాలానగర్, సనత్‌నగర్, అమీర్‌పేట ఎక్సైజ్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు ఎన్డీపీఎస్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మైనర్లకు గంజాయి సరఫరా చేయడం, విక్రయించడం తదితర ఆరోపణలపై క్రైమ్ నంబర్ 23/2026 కింద ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్లు 8(c), 20(b)(ii)(A), 27(b), జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం కేసు నమోదు చేశారు. నగరంలో మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఈగిల్ ఫోర్స్ చర్యలు చేపట్టింది.