VBGRAM-G పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి..ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించాలి.
భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ..
VBGRAM-G పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఉపసర్పంచ్ నూకం కోటేశ్వర్ ముదిరాజ్ పిలుపు
వర్షపు నీటిని వృథా చేయకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని తలకొండపల్లి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ నూకం కోటిశ్వర్ ముదిరాజ్ సూచించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వర్షపు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న VBGRAM-G పథకం కింద ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు రూ.6,500 ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఉపసర్పంచ్ అన్నారు. ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోవచ్చని, భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై తలకొండపల్లిని నీటి సంరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.