🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 12:09 pm Posted by : TELANGANA PRAJA GARJANA

అభివృద్ధి పనులకు సహకరించండి.. ఎంపీ మల్లు రవికి కాంగ్రెస్ నేతల వినతి రాయికల్ టోల్‌గేట్‌ వద్ద షాద్‌నగర్ కాంగ్రెస్ నాయకుల భేటీ

News Image

తెలంగాణ ప్రజాగర్జన |షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిని కలిశారు. అలంపూర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న ఎంపీని మంగళవారం రాయికల్ టోల్‌గేట్‌ వద్ద షాద్‌నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ్రతి బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, సర్పంచులు ఆర్. బాబు నాయక్, శివకుమార్ యాదవ్, కాంగ్రెస్ ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్ జాంగారి రవి, నాయకులు పుల్లారెడ్డి, కావాలి శ్రీశైలం ముదిరాజ్, జాంగారి జంగయ్య, యాదయ్య గౌడ్, ఈరమొని రాజు, మాజీ సర్పంచ్ అన్నారం బాలు నాయక్, మట్ట వెంకటేష్ గౌడ్, కొమ్మగంటి శ్రీహరీ గౌడ్, వీర్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home