🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 9:15 pm Posted by : TELANGANA PRAJA GARJANA

కాటేదాన్‌లో భారీ కెమికల్ పేలుడు.. ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌ శివార్లలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ కంపెనీలో భారీ కెమికల్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సాయికి తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా మారింది. మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు, భద్రతా ప్రమాణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
🏠 Home