🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 5:34 pm Posted by : TELANGANA PRAJA GARJANA

వాసవి సేవాదళ్‌ రాష్ట్ర కోశాధికారిగా బెజుగం రమేష్‌

News Image
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధ విభాగమైన వాసవి సేవాదళ్‌ రాష్ట్ర కోశాధికారిగా షాద్‌నగర్‌కు చెందిన బెజుగం రమేష్‌ ఎన్నికయ్యారు. 2026–2028 కాలానికి ఆయనను ఈ పదవిలో నియమిస్తూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ... ఆర్యవైశ్య మహాసభ చేపట్టే సేవా కార్యక్రమాలకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గందె సురేష్‌, రాష్ట్ర నాయకుడు దండు శరత్‌ చంద్రబాబు రమేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల నాయకులు యంసాని శ్రీనివాస్‌, తాటి రామ్మూర్తి, కట్ట పుల్లయ్య, గుబ్బ చంద్రశేఖర్‌, నాగిళ్ల ప్రభాకర్‌, కట్ట ప్రవీణ్‌, దండు రామ్మోహన్‌, గార్లపాటి నవీన్‌, గుబ్బ సురేష్‌ కుమార్‌, కల్వ మాణిక్యం, బండారు ఆనంద్‌, పెనుగొండ అశోక్‌, రామచంద్రుడు, ఎంబీఏ సురేష్‌, గందె రాజు, వేముల భరత్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home