🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 6:05 pm Posted by : A2TV NEWS

రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కోశాధికారిగా రేవతి దేదీప్య ఏకగ్రీవ ఎన్నిక

News Image
రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కోశాధికారిగా శ్రీమతి రేవతి దేదీప్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొంగరకలాన్‌లోని ఐడీఓసీలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి నేతృత్వంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సభ్యత్వ నమోదు, జిల్లా హౌసింగ్ సొసైటీలో అధికారులను సభ్యులుగా చేర్చడం, 2027 డైరీ, క్యాలెండర్ ప్రకటనల సేకరణ, వచ్చే నెలలో జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహణపై చర్చించారు. రాకేష్, సైదమ్మ, ఎం. శ్రీనివాస్, మహేశ్వర్, ఎన్. సూర్య, వి. జ్యోత్స్న, విక్టోరియా రాణి, డాక్టర్ దీప్తి తదితరులు వివిధ కార్యవర్గ పదవులకు ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, న్యాయమైన హక్కుల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు.
🏠 Home