🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 9:33 pm Posted by : TELANGANA PRAJA GARJANA

మూసీ బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌.. అక్రమ అరెస్టులపై ఆగ్రహం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తే అడ్డుకుంటారా? ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధితుల పక్షాన పోరాడుతాం: జక్కిడి రఘువీర్ రెడ్డి

News Image
తెలంగాణ ప్రజాగర్జన హైదరాబాద్‌, అక్టోబర్‌ 28: మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మూసీ సుందరీకరణపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నించారని తెలిపారు. మూసీ బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ భయపడదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసీ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
🏠 Home