🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 10:31 am Posted by : TELANGANA PRAJA GARJANA

నిధులేవీ.. అభివృద్ధి ఏదీ? చర్లగూడ సమస్యలపై ఎమ్మెల్యే కాలే యాదయ్యను నిలదీసిన సర్పంచ్ పెంటయ్య

News Image

డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు కరువు.. ఏళ్లుగా అసంపూర్తిగా బ్రిడ్జి పనులు

షాబాద్‌, అక్టోబర్‌ 28 (తెలంగాణ ప్రజాగర్జన): చర్లగూడ గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ పెంటయ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కోరారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏళ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంపై ప్రశ్నించారు. స్పందించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య సంబంధిత డీఈకి ఫోన్‌ చేసి పనుల పురోగతి, జాప్యానికి కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసి, గ్రామంలో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్‌ పెంటయ్య కోరారు.
🏠 Home