🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 8:22 am Posted by : A2TV NEWS

మోత్కూల గూడ పాఠశాలలో ఉచిత దుస్తుల పంపిణీ

News Image
నందిగామ మండల పరిధిలోని మోత్కూల గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులకు ఉచిత ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. గ్రామ ఉప సర్పంచ్ వానరసి నర్సింలు, గ్రామ కార్యదర్శి స్వాతి, మాజీ పాఠశాల చైర్మన్ యాదగిరి, వార్డు సభ్యులు నగేష్, రమేష్, హనుమంత్, మహేష్, శివకుమార్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే విద్యపై ఆసక్తి పెంచుకుని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా నేర్చుకోవాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థినులు విద్యలో రాణించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
🏠 Home