కరువు కష్టాల్లో ఉన్న పేదలకు.. రేషన్ ద్వారా 12 రకాల నిత్యావసరాలు ఇవ్వాలి. శ్రీను నాయక్
కరువు కష్టాల్లో ఉన్న పేదలకు .. రేషన్ ద్వారా 12 రకాల నిత్యావసరాలు ఇవ్వాలి.
ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు సంభవించిన నేపథ్యంలో, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను, వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) జిల్లా ఉపాధ్యక్షులు, షాద్‌నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పేదలందరికీ ప్రతి నెలా 50 కేజీల బియ్యంతో పాటు 12 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో కరువు మండలాల సంఖ్యను పెంచాలని, వి.బి.జి.రామ్ జి చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో 200 రోజుల పనిదినాలు కల్పించి రోజువారీ వేతనం రూ.800 చెల్లించాలని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త జాబ్ కార్డులు అందజేసి, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ హామీ మేరకు వ్యవసాయ కార్మికులకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' కింద ఏడాదికి ₹12,000 తక్షణమే విడుదల చేయాలని, అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ దళితులు, గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఈ డిమాండ్ల సాధనకై నవంబర్ 6వ తేదీన చేపడుతున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని కార్మికులు, పేదలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని శ్రీను నాయక్ పిలుపునిచ్చారు.