🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 8:47 pm Posted by : A2TV NEWS

షాద్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

షాద్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని రామకృష్ణ థియేటర్ ఎదుట ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులు, నకిలీ నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్న వాహనాలు, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. వాహనదారులు రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ వెంకటేశం, ఎస్‌ఐ వెంకటేష్ పాల్గొన్నారు.
🏠 Home