🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 2:31 pm Posted by : TELANGANA PRAJA GARJANA

రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి.. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిందితుడి అరెస్ట్

News Image
రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి.. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిందితుడి అరెస్ట్

ప్రేమ నిరాకరించిందనే కోపంతోనే దాడి? తరగతి గదిలో కలకలం.. మరో విద్యార్థినికి గాయాలు

అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన కిరాతక దాడి ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దాడి అనంతరం పరారైన నిందితుడు హేమంత్‌ను ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్‌.. బాధితురాలికి సమీప బంధువుగా గుర్తించారు.పాఠశాలలో రెండో పీరియడ్ తరగతులు జరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి ప్రవేశించిన నిందితుడు గోపికపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె గొంతు, చేతులపై తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గోపిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, నిందితుడు హేమంత్ తల్లిదండ్రులు మరణించడంతో పదేళ్ల క్రితం నుంచి అయ్యవారిపల్లెలో అక్క వద్ద ఉంటున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.ప్రేమను నిరాకరించడమే దాడికి కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు పాఠశాల ప్రాంగణంలోకి మారణాయుధంతో వ్యక్తి ఎలా ప్రవేశించగలిగాడనే ప్రశ్నలు తల్లిదండ్రులు, స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
🏠 Home