ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ ప్రజా గర్జన అక్టోబర్ 26:– ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 76 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 39, ఇతర శాఖలకు సంబంధించి 37 దరఖాస్తులు ఉన్నాయి.రానున్న రోజుల్లో ఎల్‌నినో...