VBGRAM-G పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి..ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించాలి. భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ.. VBGRAM-G పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉపసర్పంచ్ నూకం కోటేశ్వర్ ముదిరాజ్ పిలుపు వర్షపు నీటిని వృథా చేయకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని తలకొండపల్లి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ నూకం కోటిశ్వర్ ముదిరాజ్ సూచించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వర్షపు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న VBGRAM-G పథకం కింద ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు రూ.6,500 ఆర్థిక సహాయం...