చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలి

చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలి పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం మందమర్రి, అక్టోబర్ 26 (తెలంగాణ ప్రజా గర్జన) విద్యార్థులు చిన్నతనం నుండే చట్టం పట్ల గౌరవం, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగే క్రమశిక్షణను అలవర్చుకోవాలని పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్‌ లో స్థానిక పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు,...