మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు 28న ధ్రువపత్రాల పరిశీలన, వ్రాత పరీక్ష

మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు 28న ధ్రువపత్రాల పరిశీలన, వ్రాత పరీక్ష *జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 26 (తెలంగాణ ప్రజా గర్జన): జిల్లా పరిధిలో జాతీయ ఆయుష్ మిషన్‌ క్రింద ఆయుష్ పబ్లిక్ హెల్త్ కార్యక్రమాల నిర్వహణకు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ 28వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన తో పాటు వ్రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 28న ఉదయం 10 గంటలకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన,...