భూ బాధితులతో కలిసి కలెక్టరేట్ ఎదుటే భోజనం చేసిన విశారదన్ మహరాజ్! దండుమైలారం భూ బాధితుల ధర్నాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ మద్దతు.
*తెలంగాణ ప్రజాగర్జన.రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట దండుమైలారం భూ బాధితులు చేపట్టిన అఖిలపక్ష ధర్నాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ మద్దతుగా పాల్గొన్నారు. సోమవారం (అక్టోబర్ 26) బాధితులతో కలిసి ధర్నాలో కూర్చొని వారికి సంఘీభావం తెలిపారు. బాధితుల పక్షాన నిలిచిన ఆయన, వారితో కలిసి కలెక్టరేట్ ఎదుటే భోజనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భూ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా నిలుస్తూ, వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు.