తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక.!
బంగాళాఖాతంలో బలపడుతున్న ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 28న తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది....