శంషాబాద్‌లో సినీ తరహాలో ‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణ! 70 ఎంఎం తెరపై.. డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో గ్రాండ్‌ లాంచ్‌

తెలంగాణ ప్రజాగర్జన | శంషాబాద్‌//సిద్దు రెడ్డి కందకట్ల తన తొలి గీతం ‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణను వినూత్నంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌ 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. భారీ 70 ఎంఎం సినిమా తెరపై, డాల్బీ అట్మాస్‌ సరౌండ్‌ సౌండ్‌తో పాటను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు సిద్దు రెడ్డి అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పూర్తి పాట విడుదల కానుంది. ఈ కార్యక్రమాన్ని ఏబీఎన్‌, ఎన్‌టీవీ, ఈటీవీ, టీవీ9, 10టీవీ, టీవీ5, వీ6, సాక్షి తదితర చానళ్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం...