కరువు జాబితాలో కొందుర్గుకు చోటేది? పంటలు ఎండుతున్నా గుర్తింపు కరువేనా? రైతుల కష్టాలు పట్టించుకోరా? మాజీ ఎంపీటీసీ శివలీల వీరేష్‌ ఆవేదన

తెలంగాణ ప్రజాగర్జన | కొందుర్గు.తాజాగా ప్రకటించిన కరువు మండలాల జాబితాలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చోటు కల్పించకపోవడంపై విశ్వనాథ్‌పూర్‌ మాజీ ఎంపీటీసీ శివలీల వీరేష్‌ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులను పరిశీలించి కొందుర్గును వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటికి నదీ జలాలు, కాలువలు, పెద్ద చెరువులు వంటి ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మండలాన్ని కరువు జాబితాలో చేర్చకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. “కొందుర్గు మండలం ధనిక మండలమా? పంటల దిగుబడులు ఎంత ఉన్నాయి? రైతులంతా ఆర్థికంగా బలంగా...