పారిశుద్ధ్య కార్మికులకు పండగ కానుక.. మార్వాడీ సమాజ్ ఔదార్యం
సేవా స్ఫూర్తికి పండగ వేళ గౌరవం 210 మంది మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ 30 మంది దాతల సహకారంతో కార్యక్రమం సేవా భావంతో ఇతరులకు మేలు చేయాలి: ఏసీపీ లక్ష్మీనారాయణ షాద్నగర్ పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రాజస్థానీ మార్వాడీ సమాజ్ పండగ కానుక అందించింది. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని మంగళవారం షాద్నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 210 మంది కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఇందులో 110 మంది మహిళా కార్మికులు, 100 మంది పురుష కార్మికులు ఉన్నారు. సంఘం నిర్వాహకులు రాధ్యే శ్యామ్ గౌర్, భావన్లాల్ చౌదరి, కైలాష్ చౌదరి, రాజు...