అర్నాబ్ తుపాను ప్రభావం.. శంషాబాద్‌ నుంచి 13 విమానాలు రద్దు

అర్నాబ్ తుపాను ప్రభావం.. శంషాబాద్‌ నుంచి 13 విమానాలు రద్దు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం సర్వీసులకు అంతరాయం హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (తెలంగాణ ప్రజాగర్జన): అర్నాబ్‌ తుపాను ప్రభావంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం (భోగాపురం) వెళ్లాల్సిన 13 విమానాలను రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆకస్మికంగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు...