వాసవి సేవాదళ్ రాష్ట్ర కోశాధికారిగా బెజుగం రమేష్
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధ విభాగమైన వాసవి సేవాదళ్ రాష్ట్ర కోశాధికారిగా షాద్‌నగర్‌కు చెందిన బెజుగం రమేష్ ఎన్నికయ్యారు. 2026–2028 కాలానికి ఆయనను ఈ పదవిలో నియమిస్తూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... ఆర్యవైశ్య మహాసభ చేపట్టే సేవా కార్యక్రమాలకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గందె సురేష్, రాష్ట్ర నాయకుడు దండు శరత్ చంద్రబాబు రమేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం...