‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు 30న శంషాబాద్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో 70 ఎంఎం థియేటర్‌ తరహాలో ప్రదర్శన కందకట్ల సిద్దు రెడ్డిని శాలువాతో సన్మానించిన సీపీఐ నాయకులు నర్రా గిరి

శంషాబాద్‌, అక్టోబర్‌ 28 (తెలంగాణ ప్రజాగర్జన): సామాజిక సేవలో ముందుంటూ పేదలకు అండగా నిలుస్తున్న వ్యాపారవేత్త, సామాజికవేత్త కందకట్ల సిద్దు రెడ్డిని సీపీఐ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 30న శంషాబాద్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో యూట్యూబ్‌ వేదికగా విడుదల కానున్న ‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు పాటను పెద్ద తెరపై వీక్షించేలా 70 ఎంఎం సినిమా థియేటర్‌ తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కందకట్ల సిద్దు రెడ్డి పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆపదలో అండగా నిలుస్తూ, విద్యారంగ అభివృద్ధి, పాఠశాలలు, మౌలిక సదుపాయాల కల్పనకు తన సొంత నిధులతో సేవలు అందించడం అభినందనీయమని సీపీఐ...