**నిశ్చితార్థ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్** కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజాగర్జన.నందిగామ, అక్టోబర్‌ 28: నందిగామ మండలం చేగూర్‌ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కూరగాయల బాలరాజు కుటుంబంలో జరిగిన నిశ్చితార్థ వేడుకకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను అభినందించి, వారి నూతన జీవితం ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ విఠల్‌, సర్పంచ్‌ జెట్ట కుమార్‌, నాయకులు బుగ్గ మల్లేష్‌, కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.