కరువు జాబితాలో తలకొండపల్లికి అన్యాయం. ఉప సర్పంచ్ నూకం కోటిశ్వర్ ముదిరాజ్

పంటలు ఎండిపోతున్నా.. ప్రభుత్వానికి కనిపించడంలేదా? కరువు మండలాల జాబితాపై పునఃపరిశీలన చేయాలి. తలకొండపల్లి ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్ డిమాండ్. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు..మరోవైపు ఎండిపోతున్న పంటలు..ఇంకోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఇలా అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వ కరువు జాబితాలో తలకొండపల్లికి చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు ఒకలా ఉంటే.. కరువు మండలాల ఎంపిక మరోలా ఉందనే ఆవేదన వ్యక్తమవుతోంది. రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా కరువు మండలాలను ఎలా నిర్ణయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2026 ఖరీఫ్ కరువు మండలాల ప్రకటనలో రంగారెడ్డి జిల్లాలో 18 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిందని, అయితే కల్వకుర్తి...