కొత్తూరు రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం.. ఆచూకీ కోసం రైల్వే పోలీసుల విజ్ఞప్తి.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. గురువారం (అక్టోబర్ 29) ఉదయం సుమారు 10 గంటల సమయంలో కాచిగూడ–అశోకపురం ఎక్స్‌ప్రెస్ (12785) కింద పడి 30 నుంచి 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.స్టేషన్ మాస్టర్ విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి. మల్లేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అతను ఎరుపు రంగు టీషర్ట్, నీలం రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుడి చేతిపై, ఎడమ భుజంపై శంఖం ఆకారపు టాటూలు ప్రత్యేక ఆనవాళ్లుగా ఉన్నాయి....