వేసవిని దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస సాగుపై దృష్టి సారించాలి పాడి రైతులకు మండల పశు వైద్యాధికారి భాను నాయక్ సూచన
కడ్తాల్, అక్టోబర్ 30 (తెలంగాణ ప్రజా గర్జన): ఎల్నినో ప్రభావం, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని పాడి రైతులు పశుగ్రాస కొరతను నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో పశుగ్రాస సాగు చేపట్టాలని కడ్తాల్ మండల పశుసంవర్ధక అధికారి డాక్టర్ భాను నాయక్ సూచించారు. ఇందుకోసం వికసిత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ-జీ-ఆర్-ఏ-ఎం-జీ) పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పథకం కింద వ్యక్తిగత రైతులు లేదా రైతుల సంఘాలు, సొసైటీలు నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు పశుగ్రాస సాగు చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. అర్హత కలిగిన రైతులు జాబ్ కార్డు, భూమి పట్టా పాస్ పుస్తకంతో పాటు...