నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్న జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడి అరెస్ట్

నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్న జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడి అరెస్ట్ ఆధార్, పాన్ కార్డుల్లో అనధికారికంగా మార్పులు చేస్తూ నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి శ్రీరామ్ కాలనీకి చెందిన చింతల మహదేవ్ (36) అనే జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.బడ్వేల్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ‘కవిత ఏ టు జెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్’ పేరుతో జిరాక్స్ సెంటర్ నడుపుతున్న మహదేవ్, ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ల...