కరువు కష్టాల్లో ఉన్న పేదలకు.. రేషన్ ద్వారా 12 రకాల నిత్యావసరాలు ఇవ్వాలి. శ్రీను నాయక్

కరువు కష్టాల్లో ఉన్న పేదలకు .. రేషన్ ద్వారా 12 రకాల నిత్యావసరాలు ఇవ్వాలి. ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు సంభవించిన నేపథ్యంలో, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను, వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) జిల్లా ఉపాధ్యక్షులు, షాద్‌నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పేదలందరికీ ప్రతి నెలా 50 కేజీల బియ్యంతో పాటు 12 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా...