షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం..ప్రసవానికి వచ్చిన గర్భిణీ, కడుపులోని శిశువు మృతి
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవానికి వచ్చిన గర్భిణీ, కడుపులోని శిశువు మృతి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆరోపణ.. సమగ్ర విచారణకు ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆనేగాళ్ల ఆనంద్ మాదిగ డిమాండ్ షాద్ నగర్, అక్టోబర్ 30,తెలంగాణ ప్రజా గర్జన :– రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీతో పాటు కడుపులోని శిశువు మృతి చెందడం కలకలం రేపింది. కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రమేష్ కుమార్, రాధా దంపతులకు ఈ విషాదం ఎదురైంది.మొదట కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి నుంచి షాద్‌నగర్‌కు పంపించినట్లు బాధిత కుటుంబం తెలిపింది. షాద్‌నగర్...