సాహసోపేతంగా కాపాడిన DRF, MRT సిబ్బంది బాధితుడిని పరామర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల పరిశీలన

వరదలో చిక్కుకున్న వ్యక్తికి హైడ్రా బృందాల రక్షణ 50 మీటర్ల దూరం పైపులో కొట్టుకుపోయిన వ్యక్తి.. సాహసోపేతంగా కాపాడిన DRF, MRT సిబ్బంది బాధితుడిని పరామర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల పరిశీలన మాదాపూర్, అక్టోబర్ 31 (తెలంగాణ ప్రజాగర్జన): భారీ వర్షంతో వరద ఉధృతికి కొట్టుకుపోతున్న వ్యక్తిని హైడ్రా DRF, MRT బృందాలు సాహసోపేతంగా రక్షించాయి. శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్, దుర్గం చెరువు సమీపంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు ఎలక్ట్రిక్ మోపెడ్‌పై వెళ్తున్న అర్జున్ కిషోర్ (45) వరద నీటి ప్రవాహానికి అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. ఇటీవల ఎస్‌ఎన్‌డీపీ పనుల్లో భాగంగా నిర్మించిన భూగర్భ పైపులైన్‌లో సుమారు 50...