షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, శిశువు మృతి.!
షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, శిశువు మృతి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ, కడుపులోని శిశువు మృతి చెందారు. కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధ (28)ను కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. నార్మల్ డెలివరీ అవుతుందని, కొద్దిసేపు వేచి ఉండాలని వైద్య సిబ్బంది చెప్పడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.అయితే ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వైద్య సిబ్బంది కాలయాపన చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రాధ పరిస్థితి విషమించి నోట్లో నుంచి నురగలు రావడంతో తీవ్రమైన ఫిట్స్ వస్తున్నాయని,...