ఎలికట్ట అంబాభవాని ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

రంగారెడ్డి జిల్లా ఎలికట్ట గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అంబాభవాని మాత దేవాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, ధూపదీప నైవేద్య కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఆలయ పూజారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాకలి చంద్రయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. షాద్‌నగర్ మున్సిపల్ పట్టణానికి చెందిన పడబట్ల సత్యనారాయణ దంపతులు, వారి కుటుంబసభ్యులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఎలికట్టతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి...