Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతులకు పథకాలపై అవగాహన ఏదీ? 75 శాతం రాయితీ గడ్డి విత్తనాలపై తెలియని రైతులు పశుసంవర్ధక శాఖ అధికారిపై సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశం

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 26 Oct 2026, 04:32 PM | తెలంగాణ
రైతులకు పథకాలపై అవగాహన ఏదీ?  75 శాతం రాయితీ గడ్డి విత్తనాలపై తెలియని రైతులు  పశుసంవర్ధక శాఖ అధికారిపై సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశం

  • రైతులకు పథకాలపై అవగాహన ఏదీ?
  • 75 శాతం రాయితీ గడ్డి విత్తనాలపై తెలియని రైతులు
  • పశుసంవర్ధక శాఖ అధికారిపై సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశం

కల్వకుర్తి, అక్టోబరు 26: రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 75 శాతం రాయితీపై గడ్డి విత్తనాలు అందిస్తున్నా, విషయం తెలియక రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో సోమవారం పర్యటించిన కలెక్టర్.. రైతు కృష్ణయ్య నిర్వహిస్తున్న పాడి పరిశ్రమను సందర్శించారు. గడ్డి విత్తనాలను ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామని, రాయితీ విషయం అధికారులు చెప్పలేదని రైతు వివరించారు. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నాగరాజును సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఏఈఓ సురేష్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని సూచించారు. అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సర్పంచి తలసాని కృష్ణారెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం, ఎంపీడీవో యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

రైతులకు పథకాలపై అవగాహన ఏదీ?  75 శాతం రాయితీ గడ్డి విత్తనాలపై తెలియని రైతులు  పశుసంవర్ధక శాఖ అధికారిపై సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: