Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పొలాలకు దారేది..? వెంచర్‌తో రైతులకు ఇక్కట్లు అసైన్డ్‌ భూమి ఆక్రమణపై ఆరోపణలు.. కలెక్టర్‌కు వినతి

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 26 Oct 2026, 08:13 PM | తెలంగాణ
పొలాలకు దారేది..? వెంచర్‌తో రైతులకు ఇక్కట్లు అసైన్డ్‌ భూమి ఆక్రమణపై ఆరోపణలు.. కలెక్టర్‌కు వినతి

తెలంగాణ ప్రజాగర్జన, వికారాబాద్‌: వెంచర్‌ నిర్మాణంతో తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి మూసుకుపోయిందని వికారాబాద్‌ మండలం సిద్ధులూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అరక ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో చేపట్టిన వెంచర్‌ కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సారోని వాగులో రాతి కట్టలు తొలగించి రోడ్డు నిర్మించారని, అసైన్డ్‌ భూమి ఆక్రమణకు గురైందని ఆరోపించారు. ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, తమ పొలాలకు దారి కల్పించాలని కోరారు. కలెక్టర్‌ స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం సుమారు 50 మంది రైతుల సంతకాలతో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: