Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చిల్లర కోసం చిచ్చు.. మహిళా కండక్టర్‌పై దాడి! బస్సులో నుంచి కిందకు నెట్టడంతో రెండు కాళ్లు విరగిన వైనం

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 27 Oct 2026, 04:53 AM | తెలంగాణ
చిల్లర కోసం చిచ్చు.. మహిళా కండక్టర్‌పై దాడి!  బస్సులో నుంచి కిందకు నెట్టడంతో రెండు కాళ్లు విరగిన వైనం

తెలంగాణ ప్రజాగర్జన..| భద్రాద్రి కొత్తగూడెం:-చిల్లర డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం మహిళా కండక్టర్‌ను ఆసుపత్రి పాలు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక, టికెట్‌ కోసం కండక్టర్‌ ప్రవళికకు రూ.100 ఇచ్చింది. బాలుడికి రూ.10 టికెట్‌ జారీ చేసిన ప్రవళిక, మిగతా చిల్లరను టికెట్‌ వెనుక రాసి ఇచ్చింది. అయితే చిల్లర వెంటనే ఇవ్వాలని పట్టుబట్టిన మౌనిక, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి ఆమెను బస్సు నుంచి కిందకు నెట్టివేసినట్లు సమాచారం. దీంతో ప్రవళిక బస్సు వెనుక టైర్ల కింద పడటంతో రెండు కాళ్లు విరిగాయి. వెంటనే స్పందించిన ప్రయాణికులు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు మౌనికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: