Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఒడిశా నుంచి గంజాయి సరఫరా.. హైదరాబాద్‌లో 13 కిలోలు పట్టివేత

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 28 Oct 2026, 05:03 PM | Array
ఒడిశా నుంచి గంజాయి సరఫరా.. హైదరాబాద్‌లో 13 కిలోలు పట్టివేత

ఒడిశా నుంచి గంజాయి సరఫరా.. హైదరాబాద్‌లో 13 కిలోలు పట్టివేత


టాస్క్‌ఫోర్స్, బోరబండ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌.. ఒకరి అరెస్ట్




నగరంలో గంజాయి అక్రమ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌ (జూబ్లీహిల్స్‌ జోన్‌), బోరబండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని మహమ్మద్ అయాజ్‌ అలియాస్‌ నిస్సార్‌ అలియాస్‌ బ్యాండ్‌ (28)ను అరెస్ట్‌ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీరామ్‌నగర్‌కు చెందిన అయాజ్‌ ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అక్రమంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశాలోని ఖోర్ధా జిల్లా తంగి గ్రామానికి చెందిన సరఫరాదారు నుంచి ఏడాదిగా గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో పరిచయస్తులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.ఎస్‌పీఆర్‌ హిల్స్‌ సమీపంలోని ఖాళీ స్థలంలో వినియోగదారుడి కోసం వేచి ఉన్న సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 13 కిలోల గంజాయి, ఒక మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం అంచనా విలువ రూ.6.50 లక్షలుగా పోలీసులు పేర్కొన్నారు.జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జె. రాజశేఖర్‌, ఎస్‌ఐ డి. రవిరాజ్‌ బృందం, బోరబండ పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: