Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రంగారెడ్డి జిల్లాలో సీఎంఆర్ బకాయిల వసూలుపై సమీక్ష

Author
Posted By News Desk
| 28 Oct 2026, 05:12 PM | వార్తలు
రంగారెడ్డి జిల్లాలో సీఎంఆర్ బకాయిల వసూలుపై సమీక్ష

రంగారెడ్డి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూలుపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రారెడ్డి కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2014-15 నుంచి 2024-25 వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వసూలు చేయాలని అధికారులకు సూచించారు. బకాయిదారులైన రైస్ మిల్లర్లతో మాట్లాడి, చెల్లించాల్సిన మొత్తాల వివరాలను పరిశీలించారు. బకాయిల చెల్లింపునకు మిల్లర్లకు తుది అవకాశం కల్పిస్తూ, సమావేశం జరిగిన తేదీ నుంచి వారం రోజుల్లోగా మొత్తం బకాయిలను చెల్లించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని మిల్లర్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బకాయిల వసూలును ప్రాధాన్యతగా తీసుకొని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి