Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రక్తదానం జోయెల్‌ డేవిస్‌, రాహుల్‌ హెగ్డే, నాగభూషణం పిలుపు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 29 Oct 2026, 03:29 PM | తెలంగాణ
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రక్తదానం  జోయెల్‌ డేవిస్‌, రాహుల్‌ హెగ్డే, నాగభూషణం పిలుపు

తెలంగాణ ప్రజాగర్జన.శంషాబాద్‌, అక్టోబర్‌ 29: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని సిటీ ట్రైనింగ్‌ కాలేజీ (సీటీసీ), పట్లబురుజులో నిర్వహించిన రక్తదాన శిబిరంలో శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల బృందం సేవాభావాన్ని చాటుకుంది. శంషాబాద్‌కు చెందిన ట్రాఫిక్‌ పోలీసులు, ట్రాఫిక్‌ మార్షల్స్‌, యువత కలిపి సుమారు 35 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవిస్‌ ఐపీఎస్‌, ట్రాఫిక్‌ డీసీపీ-3 రాహుల్‌ హెగ్డే ఐపీఎస్‌, అడిషనల్‌ డీసీపీ రాములు ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం అందించి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందుండటం అభినందనీయమన్నారు. శంషాబాద్‌ ఏసీపీ పి. నాగభూషణం మాట్లాడుతూ రక్తదానానికి ముందుకొచ్చిన సిబ్బందిని అభినందించారు. ట్రాఫిక్‌ సీఐ ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ శంషాబాద్‌ నుంచి 35 మంది రక్తదానం చేయడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత, పోలీసు సిబ్బంది భాగస్వాములు కావాలని కోరారు. రక్తదాతలను ఉన్నతాధికారులు అభినందించారు.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రక్తదానం  జోయెల్‌ డేవిస్‌, రాహుల్‌ హెగ్డే, నాగభూషణం పిలుపు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: