Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజాసేవకు పదవులు అవసరం లేదు.. సేవాభావమే ముఖ్యం! మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చొరవతో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 30 Oct 2026, 12:52 PM | తెలంగాణ
ప్రజాసేవకు పదవులు అవసరం లేదు.. సేవాభావమే ముఖ్యం!  మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చొరవతో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు

కొండారెడ్డిపల్లి, అక్టోబర్ 30 (తెలంగాణ ప్రజాగర్జన): ప్రజలకు సేవ చేయడానికి పదవులు అవసరం లేదని, సేవ చేయాలనే సంకల్పం ఉంటే ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలవవచ్చని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ నిరూపిస్తున్నారు. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కె. అనూషకు రూ.60 వేలతో పాటు వినయకు రూ.60 వేల చొప్పున మొత్తం రూ.1.20 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రత్యేక చొరవతో, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సహకారంతో మంజూరైన ఈ చెక్కులను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ఆయన కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి భరోసా కల్పిస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు కానం ప్రేమ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ కర్నెకోట నరేష్, నాయకులు కంది రాఘవేందర్ గౌడ్, దశరథ్, తేజ యాదవ్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవకు పదవులు అవసరం లేదు.. సేవాభావమే ముఖ్యం!  మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చొరవతో ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: