Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

200 కిలోమీటర్లు దాటిన శబరిమల మహాపాదయాత్ర శంషాబాద్ శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బయలుదేరిన గోనె వీరేందర్ రెడ్డి బృందం

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 31 Oct 2026, 07:38 AM | ఆంధ్రప్రదేశ్
200 కిలోమీటర్లు దాటిన శబరిమల మహాపాదయాత్ర  శంషాబాద్ శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బయలుదేరిన గోనె వీరేందర్ రెడ్డి బృందం

కర్నూల్ తెలంగాణ ప్రజాగర్జన. అక్టోబర్ 31// రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఈ నెల 24న శబరిమల మహాపాదయాత్రకు బయలుదేరిన గోనె వీరేందర్ రెడ్డి బృందం భక్తిశ్రద్ధలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పాదయాత్ర 200 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించి కర్నూలు నగరాన్ని దాటి ముందుకు సాగుతోంది. గోనె వీరేందర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, శివకుమార్, గణేష్, రవీందర్ రెడ్డి, మహేందర్‌లు అయ్యప్ప స్వామి దర్శనమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు. స్వామివారి నామస్మరణతో, దీక్షాబద్ధంగా సాగుతున్న ఈ మహాపాదయాత్రలో యాత్రికులు తమ గమ్యస్థానం వైపు అడుగులు వేస్తున్నారు.

200 కిలోమీటర్లు దాటిన శబరిమల మహాపాదయాత్ర  శంషాబాద్ శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బయలుదేరిన గోనె వీరేందర్ రెడ్డి బృందం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: