Guest

Click here to select email id / Reporter Login

మీ భాషను ఎంచుకోండి

తెలుగు Telugu

మీరు ఎంచుకున్న స్థానం

హైదరాబాద్ (Change)

నేటి ఈ-పేపర్ (Today's E-Paper)
READ NOW
వార్త / వీడియో పోస్ట్ చేయండి
POST NOW
Fact Check
CHECK NOW
రెఫరర్
REFER NOW
స్టేటస్ వీడియోలు
ఎక్స్‌క్లూజివ్
యాప్ డౌన్‌లోడ్ (Download App)
INSTALL
సెట్టింగ్స్
మీ స్పందన
సంప్రదించండి
🔥 తాజా వార్తలు 🗞️ ఈ-పేపర్ ✍️ వార్త పోస్ట్ చేయండి 🎤 ఇంటర్వ్యూలు 👥 పబ్లిక్ న్యూస్ Sports Crime Politics Bhakti Cinema Technology TELANGANA ANDHRA PRADESH 🌍 ప్రపంచం INTERNATIONAL HEALTH EDITORIAL BUSINESS తాజా వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 🏏 క్రీడలు
E-Paper TODAY
25 Oct 2026

🗞️ నేటి ఈ-పేపర్ (E-Paper)

మెయిన్ & అన్ని జిల్లాల దినపత్రిక ఎడిషన్లు చదవండి

చదవండి

ముఖ్యాంశాలు

News
పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..
News
పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం
🗳️ ప్రజాభిప్రాయం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

Crime వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 Crime

పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..

25 రోజుల క్రితం 1 పూర్తి వార్త »
Thumb
📍 Crime

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

8 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Crime News
Reporter
TPG NEWS
25 రోజుల క్రితం
Logo

పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..

సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు.. మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు.. పాతపట్నం, సెప్టెంబర్‌ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆదివారం తమ జీవాలను మేత...

ముఖ్యమైన పాయింట్స్:

  • సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు..
  • మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు..
పాతపట్నం, సెప్టెంబర్‌ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆదివారం తమ జీవాలను మేత కోసం సమీప ప్రాంతాలకు తోలుకెళ్లారు. ఈ క్రమంలో వంశధార జలాశయం ఎగువన ఉన్న సరుగుడు తోటలోకి గొర్రెలు, మేకలు ప్రవేశించాయి. అక్కడ పిచ్చి మొక్కలు, గడ్డి నివారణ కోసం కొద్దిరోజుల క్రితం పురుగుల మందు పిచికారీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ విషయం తెలియని జీవాలు మందు పిచికారీ చేసిన గడ్డి, ఆకులను మేయడంతో కొద్దిసేపటికే అస్వస్థతకు గురైనట్లు కాపరులు తెలిపారు. అనంతరం సుమారు 35 జీవాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.ఎన్నో ఏళ్లుగా గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఈ ఘటన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని బాధిత కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే జీవాలు విలవిలలాడుతూ మృతి చెందడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న జీవాలను కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. మృతిచెందిన జీవాలకు అసలు కారణాలను పశువైద్య అధికారులు నిర్ధారించాలని, పురుగుల మందు పిచికారీ చేసిన ప్రాంతంలో జీవాలు మేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.జీవాలను కోల్పోయిన బాధిత కాపరులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED 📍 All India
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Crime News
Reporter
TPG NEWS
8 రోజుల క్రితం
Logo

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం* *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు* *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6...

ముఖ్యమైన పాయింట్స్:

  • *సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం*
  • *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు*
  • *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.*
adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. *అరెస్టైన నిందితుడు:* కోడప మారుతి S/o పగ్గు, వయస్సు 34 సంవత్సరాలు, వృత్తి: రైతు, నివాసం: పరస్వాడ-బి, గడిగూడ మండలం. గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రిత్విక్ సాయి కొట్టే IPS తెలిపారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ దాడిలో నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ప్రజాభిప్రాయం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

కేటగిరీలు

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

తెలంగాణ జిల్లాలు

వీడియో షార్ట్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయి.