Guest

Click here to select email id / Reporter Login

మీ భాషను ఎంచుకోండి

తెలుగు Telugu

మీరు ఎంచుకున్న స్థానం

హైదరాబాద్ (Change)

నేటి ఈ-పేపర్ (Today's E-Paper)
READ NOW
వార్త / వీడియో పోస్ట్ చేయండి
POST NOW
Fact Check
CHECK NOW
రెఫరర్
REFER NOW
స్టేటస్ వీడియోలు
ఎక్స్‌క్లూజివ్
యాప్ డౌన్‌లోడ్ (Download App)
INSTALL
సెట్టింగ్స్
మీ స్పందన
సంప్రదించండి
🔥 తాజా వార్తలు 🗞️ ఈ-పేపర్ ✍️ వార్త పోస్ట్ చేయండి 🎤 ఇంటర్వ్యూలు 👥 పబ్లిక్ న్యూస్ Sports Crime Politics Bhakti Cinema Technology TELANGANA ANDHRA PRADESH 🌍 ప్రపంచం INTERNATIONAL HEALTH EDITORIAL BUSINESS తాజా వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 🏏 క్రీడలు
E-Paper TODAY
25 Oct 2026

🗞️ నేటి ఈ-పేపర్ (E-Paper)

మెయిన్ & అన్ని జిల్లాల దినపత్రిక ఎడిషన్లు చదవండి

చదవండి

ముఖ్యాంశాలు

News
తొండుపల్లి చెరువులోకి మురుగునీరు! జలవనరులకు ముప్పు.. కాలుష్యంపై విచారణ ఏదీ? గోదాములు, పరిసర ప్రాంతాల వ్యర్థజలాలపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్‌
News
పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం
🗳️ ప్రజాభిప్రాయం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

TELANGANA వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 TELANGANA

తొండుపల్లి చెరువులోకి మురుగునీరు! జలవనరులకు ముప్పు.. కాలుష్యంపై విచారణ ఏదీ? గోదాములు, పరిసర ప్రాంతాల వ్యర్థజలాలపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్‌

3 గం. క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Crime

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

8 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
TELANGANA News
Reporter
TPG NEWS
3 గం. క్రితం
Logo

తొండుపల్లి చెరువులోకి మురుగునీరు! జలవనరులకు ముప్పు.. కాలుష్యంపై విచారణ ఏదీ? గోదాములు, పరిసర ప్రాంతాల వ్యర్థజలాలపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్‌

శంషాబాద్‌, అక్టోబర్‌ 25: శంషాబాద్‌ పరిధిలోని తొండుపల్లి చెరువులోకి మురుగునీరు చేరుతోందన్న ఆరోపణలపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్‌ కోరారు. సమీప గ్రామాలు, ప్రైవేటు గోదాముల నుంచి వెలువడే వ్యర్థజలాలు చెరువులోకి చేరుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువు నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు. చెరువులు భూగర్భ జలాల పెరుగుదలకు, వ్యవసాయ అవసరాలకు కీలకమైన వనరులని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని...

శంషాబాద్‌, అక్టోబర్‌ 25: శంషాబాద్‌ పరిధిలోని తొండుపల్లి చెరువులోకి మురుగునీరు చేరుతోందన్న ఆరోపణలపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్‌ కోరారు. సమీప గ్రామాలు, ప్రైవేటు గోదాముల నుంచి వెలువడే వ్యర్థజలాలు చెరువులోకి చేరుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువు నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు. చెరువులు భూగర్భ జలాల పెరుగుదలకు, వ్యవసాయ అవసరాలకు కీలకమైన వనరులని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. గతంలో సమీపంలోని కాముని చెరువులో మురుగునీరు చేరిన పరిస్థితుల నేపథ్యంలోనైనా అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తొండుపల్లి చెరువులోకి మురుగునీరు చేరుతున్న విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, కాలుష్యానికి కారణాలను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వ్యర్థజలాలు చెరువులోకి చేరకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా మురుగునీటిని విడుదల చేస్తున్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 111 జీవో నిబంధనలు అమలవుతున్నాయా? శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాల అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలుపై అధికారులు సమగ్రంగా పరిశీలన చేపట్టాలని బైతి శ్రీధర్‌ కోరారు. భారీ షెడ్లు, గోదాములు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే వ్యర్థజలాల నిర్వహణపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చెరువులు, జలవనరుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, తొండుపల్లి చెరువు కాలుష్యంపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సంబంధిత అధికారులను కోరారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED 📍 All India
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Crime News
Reporter
TPG NEWS
8 రోజుల క్రితం
Logo

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం* *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు* *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6...

ముఖ్యమైన పాయింట్స్:

  • *సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం*
  • *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు*
  • *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.*
adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. *అరెస్టైన నిందితుడు:* కోడప మారుతి S/o పగ్గు, వయస్సు 34 సంవత్సరాలు, వృత్తి: రైతు, నివాసం: పరస్వాడ-బి, గడిగూడ మండలం. గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రిత్విక్ సాయి కొట్టే IPS తెలిపారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ దాడిలో నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ప్రజాభిప్రాయం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

కేటగిరీలు

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

తెలంగాణ జిల్లాలు

వీడియో షార్ట్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయి.