Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు 30న శంషాబాద్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో 70 ఎంఎం థియేటర్‌ తరహాలో ప్రదర్శన కందకట్ల సిద్దు రెడ్డిని శాలువాతో సన్మానించిన సీపీఐ నాయకులు నర్రా గిరి

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 28 Oct 2026, 07:14 PM | తెలంగాణ
‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు  30న శంషాబాద్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో 70 ఎంఎం థియేటర్‌ తరహాలో ప్రదర్శన  కందకట్ల సిద్దు రెడ్డిని శాలువాతో సన్మానించిన సీపీఐ నాయకులు నర్రా గిరి

శంషాబాద్‌, అక్టోబర్‌ 28 (తెలంగాణ ప్రజాగర్జన): సామాజిక సేవలో ముందుంటూ పేదలకు అండగా నిలుస్తున్న వ్యాపారవేత్త, సామాజికవేత్త కందకట్ల సిద్దు రెడ్డిని సీపీఐ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 30న శంషాబాద్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో యూట్యూబ్‌ వేదికగా విడుదల కానున్న ‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు పాటను పెద్ద తెరపై వీక్షించేలా 70 ఎంఎం సినిమా థియేటర్‌ తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కందకట్ల సిద్దు రెడ్డి పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆపదలో అండగా నిలుస్తూ, విద్యారంగ అభివృద్ధి, పాఠశాలలు, మౌలిక సదుపాయాల కల్పనకు తన సొంత నిధులతో సేవలు అందించడం అభినందనీయమని సీపీఐ నాయకులు కొనియాడారు. సామాజిక సేవతో ప్రజల మన్ననలు పొందుతున్న సిద్దు రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శంషాబాద్‌ మండల కార్యదర్శి నరగిరి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచమల్ల యాదగిరి, నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నరేష్‌ నాయక్‌, శాఖ కార్యదర్శి అనిత, రాజు తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: