Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కరువు జాబితాలో తలకొండపల్లికి అన్యాయం. ఉప సర్పంచ్ నూకం కోటిశ్వర్ ముదిరాజ్

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 29 Oct 2026, 02:48 PM | రాజకీయం
కరువు జాబితాలో తలకొండపల్లికి అన్యాయం. ఉప సర్పంచ్ నూకం కోటిశ్వర్ ముదిరాజ్

పంటలు ఎండిపోతున్నా.. ప్రభుత్వానికి కనిపించడంలేదా?

కరువు మండలాల జాబితాపై పునఃపరిశీలన చేయాలి.

తలకొండపల్లి ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్ డిమాండ్.



ఓ వైపు వర్షాభావ పరిస్థితులు..మరోవైపు ఎండిపోతున్న పంటలు..ఇంకోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఇలా అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వ కరువు జాబితాలో తలకొండపల్లికి చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు ఒకలా ఉంటే.. కరువు మండలాల ఎంపిక మరోలా ఉందనే ఆవేదన వ్యక్తమవుతోంది. రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా కరువు మండలాలను ఎలా నిర్ణయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.2026 ఖరీఫ్ కరువు మండలాల ప్రకటనలో రంగారెడ్డి జిల్లాలో 18 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిందని, అయితే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని తలకొండపల్లిని విస్మరించడం అన్యాయమని తలకొండపల్లి ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సాగు మరింత భారంగా మారిందని పేర్కొన్నారు.



పొలాల్లో కరువు ఛాయలు..జాబితాలో మాత్రం చోటు లేదు.



రైతులు పెట్టుబడులు పెట్టి పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని, సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోటేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తలకొండపల్లిని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోందన్నారు.క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితి, వర్షపాతం, భూగర్భ జలాల స్థితిగతులను అధికారులు సమగ్రంగా పరిశీలించారా? రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకున్నారా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.కరువు అనేది కేవలం ప్రభుత్వ రికార్డుల్లో కనిపించే గణాంకం కాదని.. రైతు పొలంలో ఎండిపోయిన పంటలో, అప్పుల భారంతో కుంగిపోతున్న అన్నదాత గుండెల్లో కనిపించే వాస్తవమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించకుండా తీసుకునే నిర్ణయాలు రైతులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.



ఎమ్మెల్యే స్పందించాలి.. రైతులకు తగిన న్యాయం చేయాలి.



కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ అంశంపై ప్రత్యేకంగా స్పందించి, తలకొండపల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోటేశ్వర్ ముదిరాజ్ కోరారు. కరువు మండలాల జాబితాపై మరోసారి సమగ్ర పునఃపరిశీలన జరిపి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా అర్హత ఉన్న మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.రైతులకు కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం.. వారి సమస్యలను గుర్తించడంలోనూ అదే బాధ్యతతో వ్యవహరించాలి. కరువు జాబితాలో తలకొండపల్లికి చోటు కల్పించి, అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్ కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి