Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వేసవిని దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస సాగుపై దృష్టి సారించాలి పాడి రైతులకు మండల పశు వైద్యాధికారి భాను నాయక్ సూచన

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 30 Oct 2026, 02:51 PM | తెలంగాణ
వేసవిని దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస సాగుపై దృష్టి సారించాలి  పాడి రైతులకు మండల పశు వైద్యాధికారి భాను నాయక్ సూచన

కడ్తాల్, అక్టోబర్ 30 (తెలంగాణ ప్రజా గర్జన): ఎల్‌నినో ప్రభావం, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని పాడి రైతులు పశుగ్రాస కొరతను నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో పశుగ్రాస సాగు చేపట్టాలని కడ్తాల్ మండల పశుసంవర్ధక అధికారి డాక్టర్ భాను నాయక్ సూచించారు. ఇందుకోసం వికసిత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ-జీ-ఆర్-ఏ-ఎం-జీ) పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పథకం కింద వ్యక్తిగత రైతులు లేదా రైతుల సంఘాలు, సొసైటీలు నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు పశుగ్రాస సాగు చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. అర్హత కలిగిన రైతులు జాబ్ కార్డు, భూమి పట్టా పాస్ పుస్తకంతో పాటు అవసరమైన పత్రాలను పశువైద్యాధికారికి సమర్పించాలని సూచించారు. అర్హత మేరకు రూ.14 వేల వరకు ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు తమ పరిధిలోని పశువుల తాగునీటి తొట్టెలను పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో అదనపు పశువుల నీటి తొట్టెలు అవసరమైతే, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు వీబీ-జీ-జీ-ఆర్-ఏ-ఎం-జీ పథకం కింద అవసరమైన పనుల మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని డాక్టర్ భాను నాయక్ సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: