Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక.!

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 27 Oct 2026, 03:05 PM | క్రైమ్
తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక.!

బంగాళాఖాతంలో బలపడుతున్న ‘అర్నబ్‌’ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్‌ 28న తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అక్టోబర్‌ 29న కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని అంచనా.తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచిస్తున్నారు. రైతులు, వాహనదారులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారిక వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించాలి.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి