Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొత్తూరు రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం.. ఆచూకీ కోసం రైల్వే పోలీసుల విజ్ఞప్తి.

Author
Posted By News Desk
| 30 Oct 2026, 08:21 AM | క్రైమ్
కొత్తూరు రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం.. ఆచూకీ కోసం రైల్వే పోలీసుల విజ్ఞప్తి.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. గురువారం (అక్టోబర్ 29) ఉదయం సుమారు 10 గంటల సమయంలో కాచిగూడ–అశోకపురం ఎక్స్‌ప్రెస్ (12785) కింద పడి 30 నుంచి 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.స్టేషన్ మాస్టర్ విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి. మల్లేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అతను ఎరుపు రంగు టీషర్ట్, నీలం రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుడి చేతిపై, ఎడమ భుజంపై శంఖం ఆకారపు టాటూలు ప్రత్యేక ఆనవాళ్లుగా ఉన్నాయి. ప్రాథమికంగా ఒడిశా లేదా బీహార్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని గుర్తించినవారు లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసినవారు షాద్‌నగర్ రైల్వే పోలీసులను 9948090426 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి